భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

అంబేద్కర్ విగ్రహాలను వెంటనే ఆవిష్కరించాలి

జిల్లా కేంద్రంలోని మెదక్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఎన్నడు?

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించి, అధికారికంగా ఆవిష్కరించాలని హోలియదాసరి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, స్థానిక MLA, జిల్లా SC అభివృద్ధి శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, చైర్మన్లు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత రత్న అవార్డు గ్రహీత శాఖమూరి యాదగిరి హోలియదాసరి కోరారు.

అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణకు చర్యలు తీసుకోవాలి

గతంలో మెదక్ జిల్లా కేంద్రంలో రాందాస్ చౌరస్తా వద్ద, పోస్ట్ ఆఫీస్ సమీపంలో రెండు అంబేద్కర్ విగ్రహాలు ఉండేవని శాఖమూరి యాదగిరి తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ విగ్రహాలకు అధికారికంగా ఆవిష్కరణ జరగకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు తగిన గౌరవం దక్కేలా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలని డిమాండ్ చేశారు.

జిల్లా కేంద్రంలోని మెదక్ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ ఎన్నడు?

డిసెంబర్ 6లోగా ఆవిష్కరణ చేపట్టాలి

2026 డిసెంబర్ 6న అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఒక విగ్రహాన్ని ఆవిష్కరించడంతో పాటు, తొలగించిన మరో విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించి ఆవిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని హోలియదాసరి హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరింది. ఈ అంశంపై అధికారులు వెంటనే స్పందించి పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది.

59 సంఘాలతో కలిసి ఆవిష్కరిస్తాం

అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోతే, 59 దళిత సంఘాలు, ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని తామే విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు చర్యలు చేపడతామని శాఖమూరి యాదగిరి తెలిపారు. అంబేద్కర్‌కు గౌరవం దక్కేలా అందరూ కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.