భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

15, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

రామాయంపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం

రామాయంపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో అడుగు పడింది. పట్టణంలోని మూడో వార్డులో ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వెంకటేశ్వర కాలనీ వరకు డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను గురువారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ పనులకు మున్సిపల్ ఏడో వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు.

రామాయంపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం

రాకపోకలకు మెరుగైన సౌకర్యం

రామాయంపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం

ఈ ప్రాంతంలో డ్రైనేజీ, రోడ్డు నిర్మాణ పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారనున్నాయి. డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కూడా అవకాశం ఏర్పడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నాయకులు తెలిపారు.

రామాయంపేటలో అభివృద్ధి పనులకు శ్రీకారం

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గుగులోతు రవి, పుట్టి సందీప్, దేవుని రంజిత్, కో-ఆప్షన్ సభ్యురాలు చింతల రాధా భవాని యాదగిరి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చింతల స్వామి, కాంగ్రెస్ నాయకులు డాకి స్వామి, ఎనిశెట్టి అశోక్, దామోదర్, మట్టి యాదగిరి, అబ్బాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు విరాట్ సుధీర్, గణేష్ కాలనీ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.