భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న పద్మాదేవేందర్‌రెడ్డి

నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న పద్మాదేవేందర్‌రెడ్డి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజేంద్రనగర్‌లో శ్రీ నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నవదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి

నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న పద్మాదేవేందర్‌రెడ్డి

ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దుర్గమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రజల జీవితాల్లో సంతోషం, శాంతి వెల్లివిరియాలని కోరుకున్నారు. శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు ప్రజల మధ్య ఐక్యతను చాటిచెబుతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో PACS ఛైర్మన్ బాదే చంద్రం, బీఆర్‌ఎస్‌ నాయకులు దోమకొండ శ్రీనివాస్‌, మార్కు రాజు, రాగి ఉమామహేశ్వర్‌, వంశీ సాగర్‌, మార్కు కిరణ్‌, రొయ్యల మధుకర్‌, మార్కు హరీష్‌, మార్కు చింటూ, మెక్కొండ వికాస్‌ తదితరులు పాల్గొన్నారు.