భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రాజేంద్రనగర్లో శ్రీ నవదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మాదేవేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె నవదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి
ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దుర్గమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై…






