భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

16, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

MRPS నూతన మండల అధ్యక్షుడిగా మేకల వినోద్ కుమార్

నర్సాపూర్ మండలం నూతన T,MRPS మండల కమిటీ నియామకం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండలంలో MRPS నూతన మండల కమిటీని నియమించారు. జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేదాసి మోహన్ మాదిగ నాయకత్వంలో ఈ నియామకాలు చేపట్టారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి జమునగల్ల కుమార్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి MRPS జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్ర ప్రభాకర్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

మండల అధ్యక్షుడిగా మేకల వినోద్ కుమార్

నర్సాపూర్ మండల నూతన అధ్యక్షుడిగా మేకల వినోద్ కుమార్ మాదిగను నియమించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి పూర్ర ప్రభాకర్ మాదిగ ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. అలాగే మండల అధికార ప్రతినిధిగా ఎర్ర విద్యాసాగర్ మాదిగ, మండల ప్రధాన కార్యదర్శిగా జమునగల్ల బాలకృష్ణ మాదిగ, మండల ఉపాధ్యక్షుడిగా ఎర్ర నరేష్ మాదిగను నియమించారు.

సంఘటనా బలోపేతానికి కృషి

నూతన కమిటీ సభ్యులకు బాధ్యతలు అప్పగించిన సందర్భంగా సంఘం కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సంస్థ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు సూచించారు. అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ సంఘం లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో MSF మెదక్ జిల్లా కన్వీనర్ నాగరాజు మాదిగ, MRPS నాయకులు అనిల్ మాదిగతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.