భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

వృద్ధుల పట్ల బాధ్యతాయుతంగా మెలగాలి: ఎం.హేమలత

తారా లక్ష్మి డాంగోరియా వృద్ధాప్య ఆశ్రమాన్ని సందర్శించిన న్యాయమూర్తి*

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: వృద్ధుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి న్యాయ సేవా సంస్థలు అండగా నిలుస్తున్నాయని నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ ఎం. హేమలత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, మెదక్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం నర్సాపూర్‌లోని తారా లక్ష్మి డాంగోరియా వృద్ధాప్య ఆశ్రమాన్ని ఆమె సందర్శించారు.

వృద్ధులకు పండ్ల పంపిణీ

ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి, వారి బాగోగులను జడ్జి ఎం. హేమలత ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అందుతున్న సేవలు, ఆశ్రమంలో కల్పించిన సౌకర్యాల గురించి వివరాలు తెలుసుకున్నారు. వృద్ధులతో మాట్లాడి వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో అందుతున్న సేవలు, సౌకర్యాల పట్ల అక్కడి వృద్ధులు సంతృప్తి వ్యక్తం చేశారు.

న్యాయ సహాయం పొందవచ్చు

తారా లక్ష్మి డాంగోరియా వృద్ధాప్య ఆశ్రమాన్ని సందర్శించిన న్యాయమూర్తి*

వృద్ధులు తమకు ఏవైనా సమస్యలు ఎదురైతే వాటి పరిష్కారం కోసం నర్సాపూర్ మండల్ లీగల్ సర్వీస్ కమిటీ ద్వారా న్యాయ సహాయం పొందవచ్చని జడ్జి ఎం. హేమలత తెలిపారు. న్యాయపరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు న్యాయ సేవా సంస్థలను సంప్రదించాలని సూచించారు. అవసరమైన వారికి న్యాయ సహాయం అందించేందుకు న్యాయ సేవా సంస్థలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

వైద్యుల సేవలు అభినందనీయం

వృద్ధులకు వైద్య సేవలు అందిస్తున్న డాంగోరియా ఆస్పత్రి వైద్యులు డా. దేవియాని, డా. స్వర్ణలత సేవలను జడ్జి ఎం. హేమలత అభినందించారు. వృద్ధాప్యంలో ఉన్నవారికి అవసరమైన వైద్యం, సంరక్షణ అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. వయసు పైబడిన వారిపట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని, వారికి ప్రేమాభిమానాలు అందిస్తూ అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు. వృద్ధుల ఆరోగ్యం, సంక్షేమం పట్ల కుటుంబ సభ్యులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఏఎస్ఐ శివకుమార్, డా. స్వర్ణలత, న్యాయవాదులు ఆర్. శ్రీనివాస్ రెడ్డి, ఏ. ఆనంద్, డాంగోరియా వృద్ధాప్య ఆశ్రమం సూపర్వైజర్ నాగలక్ష్మి, లీగల్ సర్వీసెస్ సిబ్బంది సుభాష్, అరుణ తదితరులు పాల్గొన్నారు.