భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

నర్సాపూర్ ఫుడ్ పాయిజన్ బాధితులకు MLA పరామర్శ

నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి.

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనలో అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను MLA సునీత లక్ష్మారెడ్డి పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 మందిని కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మెరుగైన వైద్యం అందించాలి

నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి.

బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలని సూచించారు. ఫుడ్ పాయిజన్ ఘటనతో బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఒకరి మృతిపై విచారం

ఈ ఘటనలో ఒకరు మృతి చెందడం పట్ల సునీత లక్ష్మారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.