భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

పెద్ద తండా అభివృద్ధికి కృషి చేస్తాం: సర్పంచి రేణుక నరేష్

పెద్ద తండా అభివృద్ధికి కృషి చేస్తాం: సర్పంచి రేణుక నరేష్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: పెద్ద తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని గ్రామ సర్పంచి బానోతు రేణుక నరేష్ తెలిపారు. ఇనుగుర్తి మండలం పెద్ద తండాలో శనివారం సర్పంచి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో చివరి విడత బిల్లు పొందేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజనకు సంబంధించిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.

ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి

ఈ సందర్భంగా గ్రామసభకు హాజరైన తండావాసులను ఉద్దేశించి సర్పంచి రేణుక నరేష్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణాలను పూర్తిస్థాయిలో చేపట్టి, నిబంధనల ప్రకారం చివరి విడత బిల్లు పొందేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.

పెద్ద తండా అభివృద్ధికి కృషి చేస్తాం: సర్పంచి రేణుక నరేష్

గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం

పెద్ద తండాలో ఒక్కొక్కటిగా అన్ని అభివృద్ధి పనులను చేపట్టి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని సర్పంచి పేర్కొన్నారు. గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి, అందరి సహకారంతో తండాను అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.

ఈ గ్రామసభలో ఉపసర్పంచి బాధావతు శిరీష జగన్, పంచాయతీ కార్యదర్శి పాష, వార్డు సభ్యురాలు బానోతు లక్ష్మి, తండా పెద్దలు బానోతు లచ్చిరాం, బానోతు ములుకు, బానోతు ఈరు, బానోతు భీమా, కరోబార్ ప్రభాకర్‌తో పాటు పలువురు తండావాసులు పాల్గొన్నారు.