భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

17, అక్టోబర్ 2026, శనివారంభారత్ సమాచార్

ఇనుగుర్తిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

ఇనుగుర్తిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను ఇనుగుర్తి మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎంపీడీవో బండారి పార్థసారథి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్, డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్ పాల్గొని మహిళలతో కలిసి వేడుకల్లో సందడి చేశారు.

ఈ కార్యక్రమానికి తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో పార్థసారథి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ దుర్గ, వివిధ గ్రామాల సర్పంచులు, ఐకేపీ, ఉపాధి హామీ సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. మహిళలు రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి తీసుకొచ్చారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. పూలతో అలంకరించిన బతుకమ్మలతో కార్యక్రమ ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.

ఇనుగుర్తిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ.. ప్రకృతిని, స్త్రీశక్తిని, జీవన విధానాన్ని ఆరాధించే పూల పండుగ బతుకమ్మ అని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతిబింబమని చెప్పారు. తరతరాలుగా వస్తున్న ఈ పండుగ మహిళల ఐక్యతను చాటడంతో పాటు ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని గుర్తు చేస్తుందని పేర్కొన్నారు.

ఇనుగుర్తిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు అవకాశాలు కల్పించడం, వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడం అవసరమని చెప్పారు.

అమ్మవారికి ప్రత్యేక పూజలు

ఇనుగుర్తిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ వేడుకల అనంతరం ఇనుగుర్తి గ్రామపంచాయతీ, ఐసీడీఎస్‌కు చెందిన ఒక్కొక్కరికి రెవెన్యూ శాఖ తరఫున ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. అంతకుముందు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుర్గాదేవిని ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు తమ్మడపల్లి కుమార్–రజిని దంపతులు, బానోతు రేణుక–నరేష్, ముదిరెడ్డి కళావతి–శ్రీనివాస్ రెడ్డి, చెడుపాక సుజాత–యాకయ్య, మీటు నాయక్, ఇస్లావత్ నరేష్, నూనావత్ బద్రు నాయక్, భూక్య లక్ష్మీ–వెంకన్న, భూక్య చిన్ని–వెంకన్న పాల్గొన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ, ఎంపీడీవో, ఐసీడీఎస్, ఉపాధి హామీ శాఖల ఉద్యోగులు, స్థానిక మహిళలు హాజరై బతుకమ్మ సంబరాలను విజయవంతం చేశారు.