భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలను ఇనుగుర్తి మండల కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఎంపీడీవో బండారి పార్థసారథి ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్, డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్ పాల్గొని మహిళలతో కలిసి వేడుకల్లో సందడి చేశారు.
ఈ కార్యక్రమానికి తహసీల్దార్ సుంకరి శ్రీనివాసులు, ఎంపీడీవో పార్థసారథి, ఐసీడీఎస్ సూపర్వైజర్ దుర్గ, వివిధ గ్రామాల…






