భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం లక్ష్మీపురంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. గ్రామంలోని మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సాయంత్రం వేళ బతుకమ్మ సెంటర్‌కు తీసుకొచ్చారు. అక్కడ సంప్రదాయ పాటలు, ఆటలు, కోలాటాలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఆటపాటలతో మార్మోగిన బతుకమ్మ సెంటర్
పూలతో అలంకరించిన బతుకమ్మలతో బతుకమ్మ సెంటర్ కళకళలాడింది. మహిళలు, యువతులు, బాలికలు ఒకచోట చేరి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. కోలాటం ఆడుతూ పండుగ సంబురాలను ఆనందంగా జరుపుకున్నారు. గ్రామ సర్పంచి ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్‌రెడ్డి కూడా మహిళలు, యువతులు, బాలికలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు.
సర్పంచి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
సర్పంచి ముదిరెడ్డి కళావతి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. డీజే సౌండ్స్‌తో పాటు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో బతుకమ్మ సెంటర్ పండుగ వెలుగులతో ఆకట్టుకుంది. గ్రామ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్దుల బతుకమ్మ వేడుకలను విజయవంతం చేశారు.
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, మహిళలు
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి బద్రు నాయక్, వార్డు సభ్యులు అశోక్, బానాల నిర్మల, తేజావత్ వీరన్న, సావిత్రి, హారిక, మహిళా అధ్యక్షురాలు రమ, గ్రామైక్య సంఘం CA జమున, ముక్తేశ్వరితో పాటు గ్రామానికి చెందిన పలువురు మహిళలు పాల్గొన్నారు.