భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం లక్ష్మీపురంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఆదివారం వైభవంగా జరిగాయి. గ్రామంలోని మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సాయంత్రం వేళ బతుకమ్మ సెంటర్కు తీసుకొచ్చారు. అక్కడ సంప్రదాయ పాటలు, ఆటలు, కోలాటాలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఆటపాటలతో మార్మోగిన బతుకమ్మ సెంటర్
పూలతో అలంకరించిన బతుకమ్మలతో బతుకమ్మ సెంటర్ కళకళలాడింది. మహిళలు, యువతులు, బాలికలు ఒకచోట చేరి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు. కోలాటం ఆడుతూ పండుగ సంబురాలను…






