భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, అక్టోబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

నిజామాబాద్‌లో నిధి అగర్వాల్ సందడి

నిజామాబాద్‌లో నిధి అగర్వాల్ సందడి

భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన టీఆర్‌పీ విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌ను దక్షిణాది సినీ నటి నిధి అగర్వాల్ ఘనంగా ప్రారంభించారు. యాక్సిస్ బ్యాంక్ పక్కన ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ MLA ధన్‌పాల్ సూర్యనారాయణ, తొడుపునూరి శ్రీనివాస్, పాలభట్ల ఆనంద్ బాబు పాల్గొన్నారు.

సంప్రదాయానికి ఆధునిక హంగులు

షోరూమ్‌ను ప్రారంభించిన అనంతరం నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌ను ప్రారంభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. సంప్రదాయ కళాత్మకతను ఆధునిక శైలితో మేళవించిన విభిన్నమైన ఆభరణాల డిజైన్లు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పారు.

నిజామాబాద్‌లో నిధి అగర్వాల్ సందడి

నిజామాబాద్‌కు మరిన్ని బ్రాండ్లు రావాలి

MLA ధన్‌పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. నిజామాబాద్‌కు వివిధ షోరూమ్‌లు, ప్రముఖ బ్రాండ్లు రావడం గర్వకారణమని తెలిపారు. హైదరాబాద్‌కు సమానంగా నిజామాబాద్‌లోనూ మరిన్ని బ్రాండ్లు ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు నగర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని చెప్పారు.

విభిన్న డిజైన్లలో బంగారు, వజ్రాభరణాలు

నిజామాబాద్‌లో నిధి అగర్వాల్ సందడి

తొడుపునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సంప్రదాయ ఆభరణాల తయారీలోని నైపుణ్యాన్ని ఆధునిక డిజైన్లతో సమన్వయం చేస్తూ ఆకట్టుకునే ఆభరణాల కలెక్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మహిళలు, పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బంగారు, వజ్రాభరణాలతో పాటు నెక్లెస్‌లు, బ్రాస్‌లెట్లు, చెవి ఆభరణాలు, ఉంగరాలు తదితర విస్తృత శ్రేణి ఆభరణాలు షోరూమ్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు.

నైపుణ్యం కలిగిన కళాకారులు ప్రతి ఆభరణాన్ని ఎంతో శ్రద్ధతో, ప్రత్యేకమైన డిజైన్లలో రూపొందిస్తారని చెప్పారు. కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా వారికి నచ్చిన ప్రత్యేక ఆభరణాలను తయారు చేసుకునేందుకు కస్టమైజ్డ్ జ్యువెలరీ డిజైన్ సేవలను కూడా అందిస్తున్నామని పాలభట్ల ఆనంద్ బాబు తెలిపారు.

నిధి అగర్వాల్ రాకతో సందడి

నిధి అగర్వాల్ రాకతో షోరూమ్ ప్రారంభోత్సవం సందడిగా మారింది. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ అభిమానులకు ఆప్యాయంగా అభివాదం చేస్తూ వారితో సందడి చేశారు. దీంతో ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరింత ఆకర్షణ చేకూరింది.