భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

కాంగ్రెస్ నెల్లికుదురు మండల కార్యదర్శిగా సంధ్యారాణి

కాంగ్రెస్ నెల్లికుదురు మండల కార్యదర్శిగా సంధ్యారాణి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు మండల కార్యదర్శిగా చీకటి సంధ్యారాణి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు యాదవ రెడ్డి, MLA డా. మురళి నాయక్ సమక్షంలో ఆమె నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంధ్యారాణికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కాంగ్రెస్‌ను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. పార్టీ చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

కాంగ్రెస్ నెల్లికుదురు మండల కార్యదర్శిగా సంధ్యారాణి

మండల కార్యదర్శిగా తనకు అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి చీకటి సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన నాయకుల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతో పాటు ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.

తన నియామకానికి సహకరించిన మహబూబాబాద్ MP బలరాం నాయక్, MLA డా. మురళి నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు యాదవ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్, మాజీ ZPTC హెచ్. వెంకటేశ్వర్లు తదితర నాయకులకు సంధ్యారాణి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

సంధ్యారాణి నియామకంతో నెల్లికుదురు మండలంలో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులు ఆకాంక్షించాయి.