భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, అక్టోబర్ 2026, గురువారంభారత్ సమాచార్

బాధిత కుటుంబానికి సర్పంచి హరిచంద్ చేయూత

బాధిత కుటుంబానికి సర్పంచి హరిచంద్ చేయూత

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కుటుంబ సభ్యురాలిని కోల్పోయి విషాదంలో ఉన్న బాధిత కుటుంబానికి చీన్య తండా సర్పంచి జాటోత్ హరిచంద్ నాయక్ అండగా నిలిచారు. ఇనుగుర్తి మండలం అయ్యగారిపల్లి గ్రామానికి చెందిన గాజుల వెంకటమ్మ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న హరిచంద్ నాయక్ గురువారం పలువురితో కలిసి ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

వెంకటమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని సూచించారు. బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కుటుంబానికి తక్షణ సహాయంగా 50 కిలోల బియ్యంతో పాటు ₹.3వేలు నగదును అందజేశారు. కష్టకాలంలో బాధితులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటుతూ తన వంతు సహాయాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి మలిశెట్టి శోభన్, ఉపసర్పంచి కొనతం జ్యోతి వెంకన్న, కేసముద్రం లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు మామిడి అశోక్, కిరణ్, బొల్లు సంపత్, మలిశెట్టి దేవి తదితరులు పాల్గొన్నారు.