భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పూర్తిస్థాయి మండల కమిటీని ప్రకటించారు. గురువారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ సమక్షంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎదళ్ల యాదవ రెడ్డి నూతన కమిటీ సభ్యుల పేర్లను వెల్లడించారు. పార్టీ బాధ్యతలను వివిధ హోదాల్లో నేతలకు అప్పగించారు.
మండల కమిటీలో ఎవరెవరికి ఏ బాధ్యతలు?
మండల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రామన్నగూడెం గ్రామానికి చెందిన రావుల సతీష్‌ను నియమించారు. అధికార ప్రతినిధిగా నెల్లికుదురుకు చెందిన వరిపెల్లి పూర్ణచందర్‌ను ఎంపిక చేశారు.
ఉపాధ్యక్షులుగా వావిలాల గ్రామానికి చెందిన నలమాస తోతాద్రి, రాజుల కొత్తపల్లికి చెందిన కొండా దామోదర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
ప్రధాన కార్యదర్శులుగా శ్రీరామగిరికి చెందిన నర్సింగ్ అశోక్, రత్తిరామ్ తండాకు చెందిన గుగులోతు అశోక్, నెల్లికుదురుకు చెందిన కుమ్మరికుంట్ల మౌనేందర్, అన్నం రవి, ఆలేరుకు చెందిన ఏరే మోహన్ రావు, మునిగలవీడుకు చెందిన ఇసంపల్లి వెంకటేష్‌ను ఎంపిక చేశారు.
కార్యదర్శులుగా మదనతుర్తికి చెందిన బేతమల్ల ప్రీతం, సంధ్య తండాకు చెందిన బానోతు బాలాజీ, ఎర్రబెల్లిగూడెంకు చెందిన పల్లె యాకయ్య, రామన్నగూడెంకు చెందిన చీకటి సంధ్యారాణి, బ్రాహ్మణ కొత్తపల్లికి చెందిన పెరుమాండ్ల శంకర్ గౌడ్, రాజుల కొత్తపల్లికి చెందిన పత్తిపాక తిరుపతాచారిని నియమించారు.
కార్యవర్గ సభ్యులుగా నరసింహులగూడెంకు చెందిన పెదగాని పెద్ద నరసయ్య, మేచరాజుపల్లికి చెందిన కోటగిరి రమేష్ గౌడ్, బంజారాకు చెందిన గాయం అర్జున్ రెడ్డి, నైనాలకు చెందిన యాసం యాకయ్య, ఎర్రబెల్లిగూడెంకు చెందిన కడియం యశోద, రావిరాలకు చెందిన మండల సావిత్రి, సీతారామపురానికి చెందిన లింగంపల్లి పెద్ద నరసయ్య, మునిగలవీడుకు చెందిన ఇసంపల్లి యాకయ్య, నెల్లికుదురుకు చెందిన కొండపల్లి శ్రీశైలంను ఎంపిక చేశారు.
సమన్వయంతో పార్టీని బలోపేతం చేయాలి: ఎమ్మెల్యే మురళి నాయక్
నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని చెప్పారు.
ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కార్యకర్తలకు వివరిస్తూ వారిని కార్యోన్ముఖులను చేయాలని సూచించారు. పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం మండల అధ్యక్షుడు ఎదళ్ల యాదవ రెడ్డి నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.