భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

పెద్ద తండాలో చెక్కుల పంపిణీ

పెద్ద తండాలో చెక్కుల పంపిణీ

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆర్థికంగా అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బానోతు వీరన్న నాయక్ తెలిపారు. వైద్య ఖర్చుల భారం తగ్గించడంలో సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగపడుతుందని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు ఇది గొప్ప వరమని చెప్పారు.

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని పెద్ద తండాలో శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు పంపిణీ చేశారు. స్థానిక MLA డా. భూక్య మురళి నాయక్ ఆదేశాలు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బానోతు వీరన్న నాయక్ బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు.

అనంతరం వీరన్న నాయక్ మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సహాయం అందడం ఎంతో ఉపయోగకరమని చెప్పారు. అర్హులైన బాధితులకు ప్రభుత్వ సాయం అందించడం ద్వారా వారి కుటుంబాలకు కొంత ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బానోతు లక్ష్మీబాయి, భాస్కర్ దంపతులకు రూ.16,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును, బానోతు కళ్యాణికి రూ.36,000 విలువైన చెక్కును వీరన్న నాయక్ అందజేశారు. ఇద్దరు బాధితులకు కలిపి మొత్తం రూ.52,000 ఆర్థిక సాయం అందించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కాలేరు శివాజీ, గ్రామ పార్టీ అధ్యక్షులు బానోత్ బాలు నాయక్, భూక్య వెంకన్న, గుగులోతు మంగ్య, దేవేందర్ నాయక్, ముని, శ్రీకాంత్, బక్ష్య, సీతారాం నాయక్, వీరన్న, భాష, సామ్య తదితరులు పాల్గొన్నారు.