భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఇనుగుర్తి మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన కౌటం ఎల్లమ్మ, సుధాకర్ దంపతుల కుటుంబానికి మంజూరైన ₹.60వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శనివారం అందజేశారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెడుపాక సుజాత యాక్కయ్య, వార్డు సభ్యులతో కలిసి బైరు అశోక్ గౌడ్ చెక్కును ఎల్లమ్మకు అందించారు.
ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడే కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అర్హులైన బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలుస్తోందని చెప్పారు. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పేద కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బైరు వెంకన్న గౌడ్, ఎలుగలబోయిన శ్రీనివాస్ యాదవ్, నిడిగంటి చంద్రమౌళి, ముత్యాల సోమక్క వెంకన్న, మునిగంటి సరిత రాజు, చెడుపాక అలివేలు వెంకన్న, గుండాల మంగమ్మ ధర్మయ్య, నాయకులు గుండాల దుర్గ స్వామి తదితరులు పాల్గొన్నారు.