భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఇనుగుర్తి మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన కౌటం ఎల్లమ్మ, సుధాకర్ దంపతుల కుటుంబానికి మంజూరైన ₹.60వేల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును శనివారం అందజేశారు. స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన…






