భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఇనుగుర్తి మండల కమిటీ ప్రధాన కార్యదర్శులుగా నలుగురిని నియమించారు. DCC అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ శనివారం ఈ నియామకాలను ప్రకటించారు.
మండలంలోని కోమటిపల్లికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రావుల మల్లేశం గౌడ్, లక్ష్మీపురానికి చెందిన సీనియర్ నేత ముదిరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన యువ నాయకుడు మహంకాళి రామ్ సలీం, కొలిపాకకు చెందిన నారాయణను ప్రధాన కార్యదర్శులుగా ఎంపిక చేసినట్లు అశోక్ గౌడ్ తెలిపారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న ప్రధాన కార్యదర్శులకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇనుగుర్తి మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.
సహకరించిన నేతలకు కృతజ్ఞతలు
తమకు మండల ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించిన నాయకులకు నూతనంగా నియమితులైన మల్లేశం గౌడ్, శ్రీనివాస రెడ్డి, రామ్ సలీం, నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్, MP బలరాం నాయక్, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, DCC అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్, మాజీ DCC అధ్యక్షుడు భరత్ చంద్ర రెడ్డి, మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్ తదితరులు తమ నియామకానికి సహకరించారని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, పార్టీని మరింత బలోపేతం చేస్తామని నూతన ప్రధాన కార్యదర్శులు సంయుక్తంగా తెలిపారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధి కోసం మరింత అంకితభావంతో పనిచేస్తామని స్పష్టం చేశారు.