భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

25, అక్టోబర్ 2026, ఆదివారంభారత్ సమాచార్

బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలకు హరీష్‌రావు దిశానిర్దేశం

బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలకు హరీష్‌రావు దిశానిర్దేశం
బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలకు హరీష్‌రావు దిశానిర్దేశం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దసరా పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావును కలిశారు. పాపన్నపేట, శంకరంపేట ఆర్ మండలాలకు చెందిన సుమారు 600 మంది బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన హరీష్‌రావు నివాసానికి వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలకు హరీష్‌రావు దిశానిర్దేశం

ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తిరిగి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.

బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలకు హరీష్‌రావు దిశానిర్దేశం

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలని హరీష్‌రావు పిలుపునిచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని తెలిపారు.

బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలకు హరీష్‌రావు దిశానిర్దేశం

కంఠారెడ్డి తిరుపతిరెడ్డి వెంట పాపన్నపేట, శంకరంపేట ఆర్ మండలాలకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సుమారు 600 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దసరా శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావడంతో హరీష్‌రావు నివాసం వద్ద సందడి నెలకొంది.