భారత్ సమాచార్, మెదక్ జిల్లా: దసరా పండుగ సందర్భంగా బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావును కలిశారు. పాపన్నపేట, శంకరంపేట ఆర్ మండలాలకు చెందిన సుమారు 600 మంది బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన హరీష్‌రావు నివాసానికి వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తిరిగి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు.…






