భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ శాటిలైట్ మీడియా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలోని వివిధ టీవీ ఛానళ్లకు చెందిన మీడియా ప్రతినిధులు సమావేశమై కొత్త కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. జర్నలిస్టుల ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు వారి సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.
నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా 10 టీవీ రిపోర్టర్ దూద్వాట్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా సాక్షి టీవీ ప్రతినిధి షాదుల్లా, ప్రధాన కార్యదర్శిగా టీవీ9 ప్రతినిధి చిరంజీవి ఎంపికయ్యారు. హెచ్ఎం టీవీ ప్రతినిధి వంశీకుమార్ కార్యవర్గంలో బాధ్యతలు చేపట్టగా, టీవీ5 రిపోర్టర్ రాజేశ్వర్ గౌడ్ గౌరవ అధ్యక్షుడిగా, ఐ న్యూస్ రిపోర్టర్ నరేందర్ సలహాదారుగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ.. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. జర్నలిస్టుల మధ్య ఐక్యతను మరింత పెంపొందిస్తూ, వారి హక్కుల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని నూతన కార్యవర్గ సభ్యులు పేర్కొన్నారు. ప్రజలకు, అధికార యంత్రాంగానికి మధ్య వారధిగా నిలుస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం, ఐక్యత, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు.