భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల కేంద్రంలో నడివాడ ముదిరాజ్ సంఘం నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన సభ్యులు సమావేశమై సంఘం నూతన నాయకత్వాన్ని ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా గుండ్రపల్లి శంకర్, ఉపాధ్యక్షుడిగా పెండ్యాల యాకయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షులకు ముదిరాజ్ కులస్తులు బొట్టు పెట్టి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం ఐక్యతను కాపాడుతూ, సామాజిక వర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. సభ్యులందరినీ సమన్వయం చేసుకుంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
ఐక్యత, అభివృద్ధికి పాటుపడతాం
తమపై నమ్మకం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ముదిరాజ్ సామాజిక వర్గానికి నూతన అధ్యక్షుడు గుండ్రపల్లి శంకర్, ఉపాధ్యక్షుడు పెండ్యాల యాకయ్య కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్ కులస్తుల సంక్షేమంతో పాటు సంఘం ఐక్యత, అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతామని వారు పేర్కొన్నారు.
సంఘం అభివృద్ధికి సభ్యుల సహకారంతో కృషి చేస్తామని, సామాజిక వర్గ ఐక్యతను మరింత బలోపేతం చేసేందుకు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తామని నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులు తెలిపారు.