భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఇనుగుర్తి మండలం మునిగలవీడు గ్రామ సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు సూచించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం గ్రామంలో తన ఇంటి స్లాబ్ నిర్మాణ పనులను ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచి చైతన్య నాగరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. ఇళ్ల నిర్మాణాలను ఆలస్యం చేయకుండా వేగంగా పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు రాజు యాదవ్, శ్రీరంగం శ్రీనివాస్, భూక్యా దేవినవీన్, ఇస్సంపల్లి రాములు, ఉపేందర్, బొల్లికొండ పెద్ద వెంకటయ్య, చిన్న వెంకటయ్య, బాలరాజు, రాజశేఖర్, బొజ్జ రాములు, గడ్డమీది వెంకటయ్య, మురగుండ్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.