భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ఇనుగుర్తి మండలం మునిగలవీడు గ్రామ సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు సూచించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం గ్రామంలో తన ఇంటి స్లాబ్ నిర్మాణ పనులను ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచి చైతన్య నాగరాజు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ ముందుకు సాగుతోందని…






