భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, అక్టోబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

ఆర్ వెంకటాపూర్‌లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

ఆర్ వెంకటాపూర్‌లో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాల్మీకి బోయ సంఘం మండల అధ్యక్షుడు కే. గట్టయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, సంఘం సభ్యులు పాల్గొని మహర్షి వాల్మీకి జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

జయంతి సందర్భంగా గ్రామంలోని మహర్షి వాల్మీకి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాల్మీకి మహర్షి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకుగారి ఉమారాణి సంజీవరెడ్డి, వార్డు సభ్యులు రాచపల్లి ఎల్లం, కీసరి నాగరాణి రాజా గౌడ్, అనురాధ నరేష్ పాల్గొన్నారు. అలాగే వాల్మీకి బోయ సంఘం సభ్యులు సుతారి శ్రీనివాస్, స్వామి, నరసింహులు, రవి, పెంటయ్య, అంజయ్యతో పాటు పలువురు గ్రామస్తులు హాజరై వేడుకలను విజయవంతం చేశారు.