భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామంలో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాల్మీకి బోయ సంఘం మండల అధ్యక్షుడు కే. గట్టయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, సంఘం సభ్యులు పాల్గొని మహర్షి వాల్మీకి జయంతిని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
జయంతి సందర్భంగా గ్రామంలోని మహర్షి వాల్మీకి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాల్మీకి మహర్షి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు. అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం…






