భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

26, అక్టోబర్ 2026, సోమవారంభారత్ సమాచార్

కాలువ అభివృద్ధి పనులు ప్రారంభించిన MLA

కాలువ అభివృద్ధి పనులు ప్రారంభించిన MLA

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రైతులకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా, కాలువల్లో నీటి ప్రవాహం సజావుగా సాగేలా చర్యలు చేపడుతున్నట్లు MLA డా. భూక్యా మురళి నాయక్ తెలిపారు. ఈ క్రమంలో నెల్లికుదురు మండలం ఆలేరు పరిధిలోని ఎస్సారెస్పీ డీబీఎం-48 మైనర్ కాలువపై ₹.23 లక్షల నిధులతో చేపట్టనున్న పూడికతీత, అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.

కాలువ అభివృద్ధి పనులు ప్రారంభించిన MLA

సుమారు 37 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ కాలువలో పేరుకుపోయిన పూడికను తొలగించడంతో పాటు, పెరిగిన చెట్లను తొలగించే పనులు చేపట్టనున్నారు. దీంతో కాలువలో నీటి ప్రవాహానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగి, రైతుల పొలాలకు సాగునీరు సక్రమంగా చేరేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

వ్యవసాయ పనులకు సాగునీరు కీలకమని పేర్కొన్న MLA మురళి నాయక్, రైతులకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా కాలువల నిర్వహణపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. చేపట్టిన పనులను నాణ్యతా ప్రమాణాలతో, త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత ఇరిగేషన్ అధికారులకు సూచించారు. పనుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, రైతులకు వీలైనంత త్వరగా ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

కాలువ అభివృద్ధి పనులు ప్రారంభించిన MLA

రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. కాలువల అభివృద్ధి ద్వారా సాగునీటి సరఫరా మరింత మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు పద్మ సత్యపాల్ రెడ్డి, రామ్ సింగ్, గోగుల మమతా ప్రశాంత్, భాస్కర్, నెల్లికుదురు, ఇనుగుర్తి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి, బైరు అశోక్ గౌడ్, జిల్లా నాయకుడు బాలాజీ నాయక్, జిల్లా, మండల నాయకులు, ఇరిగేషన్ అధికారులు, వివిధ గ్రామాల ఉప సర్పంచులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.