భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రైతులకు సాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా, కాలువల్లో నీటి ప్రవాహం సజావుగా సాగేలా చర్యలు చేపడుతున్నట్లు MLA డా. భూక్యా మురళి నాయక్ తెలిపారు. ఈ క్రమంలో నెల్లికుదురు మండలం ఆలేరు పరిధిలోని ఎస్సారెస్పీ డీబీఎం-48 మైనర్ కాలువపై ₹.23 లక్షల నిధులతో చేపట్టనున్న పూడికతీత, అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.
సుమారు 37 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ కాలువలో పేరుకుపోయిన పూడికను తొలగించడంతో పాటు, పెరిగిన చెట్లను తొలగించే పనులు చేపట్టనున్నారు. దీంతో కాలువలో…






