భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

నర్సాపూర్‌లో ఎరువుల దుకాణాల తనిఖీ  నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎరువుల విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే సంబంధిత డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని ఎరువుల దుకాణాల్లో జిల్లా అంతర్గత స్క్వాడ్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో సహాయ వ్యవసాయ సంచాలకులు అమీనా బీ, మండల వ్యవసాయ అధికారిణి దీపిక పాల్గొన్నారు. ఎరువుల దుకాణాల్లో లైసెన్సులు, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించారు. దుకాణాల్లో నిర్వహిస్తున్న రికార్డులు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే అంశాలను తనిఖీ చేశారు.

నర్సాపూర్‌లో ఎరువుల దుకాణాల తనిఖీ  నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు

ఎరువుల విక్రయదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే లైసెన్సులు కలిగి ఉండాలని అధికారులు సూచించారు. రైతులకు నాణ్యమైన ఎరువులనే విక్రయించాలని స్పష్టం చేశారు. ఎరువుల నిల్వలకు సంబంధించిన స్టాక్‌ రిజిస్టర్లను ప్రతిరోజూ అప్‌డేట్ చేయాలని, అవసరమైన నివేదికలను వ్యవసాయ శాఖకు ఎప్పటికప్పుడు అందజేయాలని ఆదేశించారు.

ఎరువుల విక్రయాల్లో పారదర్శకత పాటిస్తూ, నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు నిర్వహించాలని డీలర్లకు సూచించారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే సంబంధిత దుకాణదారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.