భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎరువుల విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘనలకు పాల్పడితే సంబంధిత డీలర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని ఎరువుల దుకాణాల్లో జిల్లా అంతర్గత స్క్వాడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో సహాయ వ్యవసాయ సంచాలకులు అమీనా బీ, మండల వ్యవసాయ అధికారిణి దీపిక పాల్గొన్నారు. ఎరువుల దుకాణాల్లో లైసెన్సులు, విక్రయాలకు సంబంధించిన రికార్డులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. దుకాణాల్లో నిర్వహిస్తున్న రికార్డులు నిబంధనలకు…






