భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా యెన్నం రాజేందర్ రెడ్డి

మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా యెన్నం రాజేందర్ రెడ్డి..

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ నార్సింగి మండల నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన యెన్నం రాజేందర్ రెడ్డిని దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన, మండలంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.

యెన్నం రాజేందర్ రెడ్డికి మండల అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం ద్వారా నార్సింగి మండలంలో కాంగ్రెస్ పార్టీ విస్తరణకు మరింత అవకాశం ఏర్పడిందని చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పారు.

మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా యెన్నం రాజేందర్ రెడ్డి..

పార్టీ కోసం కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అందరూ సమన్వయంతో పనిచేస్తూ పార్టీ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

పార్టీ బలోపేతానికి కృషి చేస్తా: యెన్నం రాజేందర్ రెడ్డి

మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా యెన్నం రాజేందర్ రెడ్డి..

మండల అధ్యక్షుడిగా తనకు బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, TPCC రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి యెన్నం రాజేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. నార్సింగి మండలంలోని గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా యెన్నం రాజేందర్ రెడ్డి..

ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చొరవ చూపడంతో పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తానని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా తన వంతు కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సన్మాన కార్యక్రమంలో DCC జిల్లా కార్యదర్శి సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, మండల ఫిషర్మెన్ అధ్యక్షుడు సుధాకర్, మాజీ టెలికం బోర్డు మెంబర్ అంచనూరి రాజేష్, సర్పంచులు పార్ష సంతోష్, పిప్పిరి వినోద్ కుమార్, నర్సింలు, రాజేశ్వర్ గౌడ్, రుక్ముద్దీన్, గోవర్ధన్, బాలరాజు గౌడ్, కృష్ణ గౌడ్, ఆటో జానీ, శంకర్ నాయక్, బాచి స్వామి, ప్రభాకర్, నరేష్, స్వామి తదితరులు పాల్గొన్నారు.