భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

మత్స్యగిరి క్షేత్రంలో హుండీ లెక్కింపు

హుండీ ఆదాయం రూ.9.93 లక్షలు  మూడు నెలల్లో భక్తుల కానుకలు లెక్కింపు

భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: వలిగొండ మండలం వెంకటాపురంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.9,93,007 ఆదాయం సమకూరింది. మంగళవారం (అక్టోబర్ 27) దేవస్థాన హుండీని తెరిచి లెక్కించగా, గత 91 రోజుల మూడు నెలల కాలానికి ఈ ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి కె. వెంకటయ్య తెలిపారు.

హుండీ ఆదాయంతో పాటు దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్యాన్నప్రసాద కార్యక్రమం ద్వారా మరో రూ.7,543 ఆదాయం వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకలను దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో లెక్కించారు.

ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తలు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.