భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, అక్టోబర్ 2026, మంగళవారంభారత్ సమాచార్

ఓటర్ నమోదు కేంద్రాన్ని పరిశీలించిన శంకర్ నాయక్

ఓటర్ నమోదు కేంద్రాన్ని పరిశీలించిన శంకర్ నాయక్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటు హక్కు కల్పించేలా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటర్ నమోదు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు.

కేంద్రంలో ఓటరు నమోదుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, పట్టభద్రుల వివరాలను నమోదు చేస్తున్న విధానంపై పార్టీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉన్న అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారి వివరాలను సేకరించి ఓటర్లుగా నమోదు చేయించే బాధ్యతను పార్టీ కార్యకర్తలు తీసుకోవాలని తెలిపారు.

ఇనుగుర్తి మండలంలో ఒక్క అర్హుడైన గ్రాడ్యుయేట్ కూడా ఓటు హక్కును కోల్పోకుండా చూడాలని శంకర్ నాయక్ సూచించారు. ఇందుకోసం పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి పట్టభద్రులను నేరుగా సంప్రదించాలని, ఓటరు నమోదుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేలా సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

కార్యకర్తలంతా కలిసికట్టుగా కృషి చేస్తే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించడం ఖాయమని శంకర్ నాయక్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దీకొండ వెంకన్న, ఉప సర్పంచ్ సత్తూరి యాదగిరి, బేతమల్ల చంద్రయ్య, ఈర్లూ నాయక్, గుగులోత్ నరేందర్ నాయక్, వార్డు సభ్యులు వేముల శ్రీనివాస్, నాయకులు లింగాల శ్రీనివాస్, కుంచాల నవీన్, గడ్డం శ్రీకాంత్, బూర రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు.