భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్‌కు ఓటు హక్కు కల్పించేలా నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ క్రమంలో మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఓటర్ నమోదు కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు.
కేంద్రంలో ఓటరు నమోదుకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ, పట్టభద్రుల వివరాలను నమోదు చేస్తున్న విధానంపై పార్టీ నాయకులను…






