భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పీయూడబ్ల్యూజే (ఐజేయూ) మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులను మంగళవారం ఘనంగా సన్మానించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఐదోసారి ఎన్నికైన బసన్నపల్లి మల్లేష్ యాదవ్‌తో పాటు నూతన కార్యవర్గ సభ్యులను చిలుక రమాకాంత్, ఆయన మిత్రబృందం శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి పటేరి రాము, కోశాధికారి రంగ రాజా కిషన్‌తో పాటు నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు సమాజానికి అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు.
ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తూ సమాజ అభివృద్ధికి జర్నలిస్టులు తమ వంతు సేవలు అందిస్తున్నారని అన్నారు.
నూతన కార్యవర్గం జర్నలిస్టుల ఐక్యతకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగాలని, వారి సంక్షేమం కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు. అదే విధంగా ప్రజా సమస్యలను మరింత సమర్థవంతంగా వెలుగులోకి తీసుకువస్తూ, వాటి పరిష్కారం కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డీజీ శ్రీనివాస్ శర్మ, జిల్లా నాయకులు ఊడెం దేవరాజ్ యాదవ్, పాతూరి రమేష్ గౌడ్, మండల నాయకులు చిర్రా సత్యనారాయణ, తుజాల శ్రీనివాస్ గౌడ్, నారాయణ, పెంటయ్య, సారుగు నర్సింలు, చిలుక రమాకాంత్, చింతల నరేష్, పోచమ్మల మహేష్, పోచమ్మల శ్రీనివాస్, బసన్నపల్లి రాజేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.
Is this conversation helpful so far?