భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

నవంబర్ 6లోగా ఓటు నమోదు చేసుకోవాలి

నవంబర్ 6లోగా ఓటు నమోదు చేసుకోవాలి

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఓటరు నమోదు గడువు నవంబర్ 6తో ముగియనున్న నేపథ్యంలో అర్హులైన యువతీ యువకులు చివరి వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

మండల కేంద్రంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పట్టభద్రుల ఓటు ఎంతో విలువైనదని తెలిపారు. 2003 వరకు డిగ్రీ ఉత్తీర్ణులైన యువతీ యువకులు ఓటరు నమోదుకు ముందుకు రావాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ముందుగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడం ముఖ్యమని చెప్పారు.

దేశ భవిష్యత్తుపై పట్టభద్రుల ఆలోచనలు కీలకం

దేశ అభివృద్ధి, రక్షణ, అవినీతి రహిత పాలన, అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రగతి వంటి అంశాలపై పట్టభద్రులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చందు రాజకుమార్ యాదవ్ తెలిపారు. తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.

వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన యువతీ యువకులు ఎవరూ ఓటు నమోదు అవకాశాన్ని కోల్పోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గడువు ముగిసేలోగా దరఖాస్తు చేసుకుని, ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.