భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటును నమోదు చేసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు చందు రాజకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ఓటరు నమోదు గడువు నవంబర్ 6తో ముగియనున్న నేపథ్యంలో అర్హులైన యువతీ యువకులు చివరి వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
మండల కేంద్రంలో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పట్టభద్రుల ఓటు ఎంతో విలువైనదని తెలిపారు. 2003 వరకు డిగ్రీ ఉత్తీర్ణులైన యువతీ యువకులు ఓటరు నమోదుకు…






