భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

నిరుపేద కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం

నిరుపేద కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: కుటుంబ పెద్దను కోల్పోయి విషాదంలో ఉన్న నిరుపేద కుటుంబానికి పలువురు దాతలు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఆర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన శివాయిపల్లి నరేష్ మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం.

నరేష్ కుటుంబం నిరుపేద పరిస్థితిని తెలుసుకున్న గ్రామానికి చెందిన పలువురు ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో మొత్తం ₹.25వేల సాయం అందించారు.

నిరుపేద కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం

గ్రామ సర్పంచ్ ఉమారాణి సంజీవరెడ్డి ₹.10వేలు అందించగా, ప్రముఖ సంఘ సేవకుడు వెంకు గారి రాజిరెడ్డి ₹.5వేలు, మాజీ సర్పంచ్ బండారు మహేందర్ రెడ్డి ₹.5వేలు, టీఆర్‌ఎస్ పార్టీ మెదక్ ఇన్‌చార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ₹.5వేలు ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా దాతలు బాధిత కుటుంబానికి భవిష్యత్తులోనూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవచ్చని ఈ సహాయ కార్యక్రమం తెలియజేసింది.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమారాణి సంజీవరెడ్డి, వార్డు సభ్యులు కే. గట్టయ్య, పూర్ర స్వామి, రాచపల్లి ఎల్లం, టీఆర్‌ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు తాడే సునీల్, గ్రామస్తులు కీసరి రాజా గౌడ్, సాయిల నరేష్, కొమ్మగల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.