భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన ద్యప లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంటారెడ్డి తిరుపతిరెడ్డి స్పందించి, మృతురాలి కుటుంబానికి ₹.5వేల ఆర్థిక సహాయం అందించారు.
లక్ష్మి మృతి గురించి స్థానిక బీఆర్ఎస్ నాయకులు తిరుపతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. మృతురాలి మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి తన వంతు సహాయం అందించాలని నిర్ణయించారు. ఆయన సూచనల మేరకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించి ₹.5వేల నగదును అందజేశారు.
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సహాయం అందించినట్లు స్థానిక నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీను, వగ్గు కృష్ణ, బక్కయ్యగారి రమణ, వగ్గు వంశీ సాగర్, ఏళ్లగారి రాజు, వగ్గు పవన్ సాగర్, రవి, క్రాంతి, జైపాల్, ప్రశాంత్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.