భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన ద్యప లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కంటారెడ్డి తిరుపతిరెడ్డి స్పందించి, మృతురాలి కుటుంబానికి ₹.5వేల ఆర్థిక సహాయం అందించారు.
లక్ష్మి మృతి గురించి స్థానిక బీఆర్ఎస్ నాయకులు తిరుపతిరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన వెంటనే స్పందించారు. మృతురాలి మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబానికి తన వంతు సహాయం అందించాలని నిర్ణయించారు. ఆయన సూచనల మేరకు స్థానిక బీఆర్ఎస్…






