భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, అక్టోబర్ 2026, బుధవారంభారత్ సమాచార్

డిజిటల్ భూ సర్వేకు రైతులు సహకరించాలి: RDO రమాదేవి

డిజిటల్ భూ సర్వేకు రైతులు సహకరించాలి: RDO రమాదేవి

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రైతులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న భూ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు, భూముల వివరాలను పక్కాగా నమోదు చేసేందుకు రెవెన్యూ భూముల రీ-సర్వే చేపడుతున్నట్లు మెదక్ RDO రమాదేవి తెలిపారు. ఈ ప్రక్రియలో రైతులందరూ పాల్గొని అధికారులకు పూర్తి సహకారం అందించాలని ఆమె కోరారు.

డిజిటల్ భూ సర్వేకు రైతులు సహకరించాలి: RDO రమాదేవి

మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామచర్ల గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో RDO రమాదేవి మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా భూములకు సంబంధించిన వివిధ సమస్యలతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు, భూముల వివరాల్లో స్పష్టత తీసుకురావడమే డిజిటల్ భూ సర్వే ప్రధాన ఉద్దేశమని వివరించారు.

డిజిటల్ భూ సర్వేకు రైతులు సహకరించాలి: RDO రమాదేవి

డిజిటల్ సర్వే ద్వారా రైతులకు సంబంధించిన భూముల వివరాలను స్పష్టంగా నమోదు చేసేందుకు అవకాశం ఉంటుందని రమాదేవి పేర్కొన్నారు. భూముల రీ-సర్వే ప్రక్రియను సక్రమంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్తులో భూ సమస్యలు తగ్గేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.

డిజిటల్ భూ సర్వేకు రైతులు సహకరించాలి: RDO రమాదేవి

ఈ నేపథ్యంలో గ్రామంలోని రైతులందరూ డిజిటల్ భూ సర్వేలో భాగస్వాములై, సర్వే నిర్వహించే అధికారులకు అవసరమైన సహకారం అందించాలని RDO సూచించారు. భూములకు సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా రైతులు సహకరించాలని కోరారు.

ఈ గ్రామసభలో తహసీల్దార్ రజనీకుమారి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.