భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: హనుమకొండలో నవంబర్ 22న నిర్వహించనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో గురువారం సమ్మేళనానికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. స్వేరో జిల్లా అధ్యక్షుడు బాషిపంగు మహేందర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఇండ్ల వెంకటేశ్వర్లుతో కలిసి నియోజకవర్గ కో-కన్వీనర్ జెల్ల ఉపేందర్, స్వేరోలు, ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జెల్ల ఉపేందర్ మాట్లాడుతూ, హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో జరగనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనానికి స్వేరోలు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహానీయుల ఆశయాల బాటలో నడుస్తూ, స్వేరో బిడ్డలు ఉన్నత స్థాయికి ఎదిగేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.
స్వేరోల ఐక్యతకు ఆత్మీయ సమ్మేళనం
వందలాది మంది జీవితాలు సరైన మార్గంలో ముందుకు సాగేందుకు నాంది పలికిన సుప్రీం స్వేరో డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రిటైర్డ్ అదనపు DGP, ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ఉపేందర్ తెలిపారు. ఆయన రాక నేపథ్యంలో స్వేరోలు, ఆర్ఎస్పీ అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.
స్వేరోలంతా ఒకచోట చేరి ఆత్మీయంగా కలుసుకునే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. సమ్మేళనానికి సంబంధించిన సమాచారాన్ని స్వేరోలు, అభిమానులు, ప్రజా సంఘాల నాయకులకు చేరవేసి కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు.
ఈ గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో సీనియర్ స్వేరో గుండె రామనర్సయ్య, స్వేరో జిల్లా అధికార ప్రతినిధి సుధీర్, కో-కన్వీనర్ గుజ్జునూరి నరేష్, ప్రజా సంఘాల నాయకులు ఇసంపల్లి సైదులు, దండెంపెల్లి సైదులు, గౌతమ్, మహేందర్, కరుణాకర్, హెచ్. అశోక్ తదితరులు పాల్గొన్నారు.