భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: హనుమకొండలో నవంబర్ 22న నిర్వహించనున్న స్వేరో ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేసేందుకు నిర్వాహకులు ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో గురువారం సమ్మేళనానికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. స్వేరో జిల్లా అధ్యక్షుడు బాషిపంగు మహేందర్, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఇండ్ల వెంకటేశ్వర్లుతో కలిసి నియోజకవర్గ కో-కన్వీనర్ జెల్ల ఉపేందర్, స్వేరోలు, ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జెల్ల ఉపేందర్ మాట్లాడుతూ, హనుమకొండలోని కాళోజీ…