భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

ఇనుగుర్తి మండల విద్యుత్ AEగా మర్రి లక్ష్మణ్

ఇనుగుర్తి మండల విద్యుత్ AEగా మర్రి లక్ష్మణ్

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ (AE)గా మర్రి లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం స్థానిక విద్యుత్ సబ్‌స్టేషన్ కార్యాలయంలో ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పటివరకు కాజీపేట సబ్ డివిజన్‌లో సబ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించిన లక్ష్మణ్‌కు పదోన్నతి లభించింది. ఈ పదోన్నతిలో భాగంగా ఆయన ఇనుగుర్తి మండలానికి AEగా బదిలీపై వచ్చారు.

కొత్తగా బాధ్యతలు చేపట్టిన లక్ష్మణ్‌కు విద్యుత్ శాఖ లైన్‌మెన్లు, కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందనలు తెలిపారు.

అనంతరం AE లక్ష్మణ్ మాట్లాడుతూ.. మండలంలోని విద్యుత్ వినియోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, పారదర్శకంగా సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే తన ప్రాధాన్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో లైన్‌మెన్ యశ్వంత్‌తో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.