భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

30, అక్టోబర్ 2026, శుక్రవారంభారత్ సమాచార్

గురుకులంలో తహసీల్దార్ సడన్ విజిట్

గురుకులంలో తహసీల్దార్ సడన్ విజిట్

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ప్రత్యేక అధికారి, తహసీల్దార్ రజనీకుమారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, పాఠశాలలోని సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గురుకులంలో తహసీల్దార్ సడన్ విజిట్

తనిఖీలో భాగంగా విద్యార్థినులతో నేరుగా మాట్లాడిన తహసీల్దార్.. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల అభిప్రాయాలను తెలుసుకుంటూ, వారి అవసరాలపై ఆరా తీశారు.

గురుకులంలో తహసీల్దార్ సడన్ విజిట్

అనంతరం పాఠశాల వంటగదిని సందర్శించి భోజన తయారీ విధానాన్ని పరిశీలించారు. వంటకు ఉపయోగిస్తున్న నిత్యావసర సరుకుల నాణ్యత, నిల్వలు, వంటగది పరిసరాల పరిశుభ్రతను తనిఖీ చేశారు. విద్యార్థినులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన, ఆరోగ్యకరమైన భోజనం అందించాలని అధికారులకు సూచించారు.

గురుకులంలో తహసీల్దార్ సడన్ విజిట్

విద్యార్థినుల ఆరోగ్యం, విద్య, వసతి సౌకర్యాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకూడదని తహసీల్దార్ స్పష్టం చేశారు. పాఠశాల పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పించే విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.