భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ప్రత్యేక అధికారి, తహసీల్దార్ రజనీకుమారి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, పాఠశాలలోని సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తనిఖీలో భాగంగా విద్యార్థినులతో నేరుగా మాట్లాడిన తహసీల్దార్.. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, పాఠశాలలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినుల అభిప్రాయాలను తెలుసుకుంటూ, వారి అవసరాలపై ఆరా తీశారు.
అనంతరం పాఠశాల వంటగదిని సందర్శించి భోజన తయారీ విధానాన్ని పరిశీలించారు.…






