భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతదేశ సమైక్యత, సమగ్రత కోసం విశేష కృషి చేసిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను శంకరంపేట మండల కేంద్రంలో శనివారం బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు పెద్ద పట్లోరి పోగుల రాజు పటేల్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ ఐక్యతను కాపాడటంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. భారతదేశ సమైక్యత, సమగ్రత కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తూ దేశ ఐక్యతను కాపాడటంతో పాటు దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యుడు సురేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి చాకలి మహేందర్, పట్టణ అధ్యక్షుడు ఆకుల రాజు, యువమోర్చా అధ్యక్షుడు మధు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు తల్లా శివశంకర్, బూత్ అధ్యక్షులు నర్సింలు, నాగరాజు, శ్రావణ్‌తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.