భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఉద్యోగ, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందిన వెంటనే వారికి రావాల్సిన అన్ని ప్రయోజనాలను ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా చెల్లించాలని TPTF రాష్ట్ర కార్యదర్శి సిద్ధోజు కవిత డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.
మండలంలోని మునిగలవీడు ZPHSలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన గుడిబోయిన ప్రసాదరావు సన్మానోత్సవ కార్యక్రమానికి శనివారం సిద్ధోజు కవిత హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో TPTF జిల్లా అధ్యక్షుడు బాలాష్టి రమేష్, ప్రధాన కార్యదర్శి సంగ శ్రీనివాస్ తదితరులతో కలిసి ప్రసాదరావును ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న DAలను వెంటనే విడుదల చేయడంతో పాటు PRCని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. DA బకాయిలు పెండింగ్‌లో ఉండటం వల్ల పదవీ విరమణ చేసే ఉద్యోగులు తమ పెన్షన్ విషయంలోనూ ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. పదవీ విరమణ సమయంలో అందాల్సిన GPF, TSGLI, Leave Encashment వంటి ప్రయోజనాలను సకాలంలో చెల్లించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు.
సరైన ఫిట్‌మెంట్ ప్రకటించాలి: రమేష్
TPTF జిల్లా అధ్యక్షుడు బాలాష్టి రమేష్ మాట్లాడుతూ.. PRC గడువు ముగిసి మూడేళ్లు పూర్తయినా ఇప్పటివరకు PRC కమిషన్ నుంచి నివేదిక తెప్పించుకోకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నివేదికను తెప్పించుకుని ఉద్యోగులకు న్యాయం జరిగేలా సరైన ఫిట్‌మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పదవీ విరమణ పొందిన ప్రసాదరావు వృత్తి పట్ల నిబద్ధత, సమయపాలనకు ప్రాధాన్యత ఇచ్చే ఉపాధ్యాయుడని రమేష్ కొనియాడారు. ఎంతోమంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన ఆదర్శ గురువుగా ఆయన సేవలను గుర్తుచేశారు. ప్రసాదరావు అంకితభావాన్ని ఇతర ఉపాధ్యాయులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు, ఏఏపీసీ చైర్మన్ కె. చైతన్య, MEO రాందాస్, TPTF జిల్లా కార్యదర్శి సంగ శ్రీనివాస్, PRTU మండల అధ్యక్షుడు యుగేందర్‌తో పాటు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.